అభిమానుల‌ను హెచ్చ‌రించిన రేణుదేశాయ్

272
renu desai
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈమధ్య సోష‌ల్ మీడియాలో చాలా య‌క్టివ్ గా ఉంటుంది. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఆమె ముంబాయ్ లో గ‌డుపుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య కావ‌డంతో సోష‌ల్ మీడియాలో రేణు దేశాయ్ ని చాలా మంది ప‌వ‌న్ అభిమానులు ఫాలో అవుతోంటారు. ఇక ఇటివ‌లే రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ లు చూస్తుంటే తాను ఎవ‌రితోనే ల‌వ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌లు మార్లు ఆమె ప్రేమ‌క‌విత‌లు త‌న ఇస్ట్రాగ్రామ్ లో రాస్తోంది.

pawan-kalyan-kids

త‌న పిల్ల‌లు అకీరా, ఆరాధ్య అంటే త‌న‌కు చాలా ఇష్టం అని రేణు దేశాయ్ చాలా సార్లు చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా రేణు దేశాయ్ త‌న కొడుకు అకీరా ఫోటోను త‌న ఇస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా కుమారుడు చూడ‌డానికి యురోపియ‌న్ సినిమ‌ల్లోని ఓ సిరియ‌స్ క్యారెక్ట‌ర్ లా ఉన్నాడ‌ని ట్వీట్ చేసింది. త‌న ల్యాప్ టాప్ లో ఓ గేమ్ కోసం అకిరా సిరియ‌స్ గా వెతుకుతున్నాడ‌ని ట్వీట్ చేసింది. ఈసంద‌ర్భంగా ప‌లువురు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు రి ట్వీట్ లు చేస్తున్నారు.

ప‌లువురు అభిమానులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకును జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అని కామెంట్లు చేస్తున్నారు. దింతో విసుగు చెందిన రేణు దేశాయ్ ఎవ‌రైనా త‌న కుమారుడిని జునియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అంటే నా అకౌంట్ లో నుంచి వారిని డిలిట్ చేయించి బ్లాక్ చేస్తాన‌ని చెప్పింది. అలా పిల‌వ‌డం త‌న కుమారుడు అకీరాకు త‌న నాన్న‌కు, అలాగే నాకు కూడా ఇష్టం ఉండ‌దని పేర్కోంది. ఈసంద‌ర్భంగా ఆమె చేసిన కామెంట్లను ప‌లువురు స‌మ‌ర్ధిస్తోండ‌గా మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తోన్నారు.

- Advertisement -