‘మంచి రోజులు వచ్చాయి’.. యూత్ నచ్చే సాంగ్‌..

132
- Advertisement -

యువ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’.ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్ వారు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. సాయితేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ పాట, ‘సో సో గా ఉన్నాననీ .. సో స్పెషలే చేశావులే’ అంటూ సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం .. కె.కె. సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది. యూత్ నచ్చే బీట్ లోనే అనూప్ ఈ పాటకి బాణీ కట్టాడు. తనువులు వేరైనా మన ఊపిరి ఒకటే .. ఊహలు ఒకటే . దారులు ఒకటే అంటూ ఈ పాట నడుస్తోంది.

https://youtu.be/MOL1rnvXHgg
- Advertisement -