గురక పెడితే ప్రాణాలకే ప్రమాదమా?

33
- Advertisement -

గురక అనేది ప్రతిఒక్కరిలో కనిపించే స్లీపింగ్ డిజార్డర్. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది గురకతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఈ గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నిద్ర పోతున్న సమయంలో మెడ, తలభాగంలోని మృదుకణజాలంలో కంపనాల వల్ల గురక ఏర్పడుతుంది. శ్వాస తీసుకునే సమయంలో నాలుక, గొంతు, ముక్కు ద్వారాల్లో ఏదో ఒక అడ్డంకి ఏర్పడిన గురక వస్తుంది. ఈ గురక సమస్య కొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తే మరికొందరిలో దీర్ఘకాలికంగా వేధిస్తుంది. అయితే అప్పుడప్పుడు గురక సర్వసాధారణమే అయినప్పటికి దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడే వారి ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .

దీర్ఘకాలిక గురక సమస్య ఉన్నవారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువట. కొన్ని సందర్భాల్లో గురక కారణంగా ధమనుల్లో ఆటంకం పెరిగి ప్రాణాంతకంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా గురక పెట్టె వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువేనట. కాబట్టి ఇంతటి ప్రమాదకారి అయిన గురకను తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటివి గురక తీవ్రతను రెట్టింపు చేస్తాయి.

కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే నిద్రించే సమయంలో సురక్షితమైన పొజిషన్ లో పడుకొని తల కింద దిండు వంటివి ఉపయోగిస్తే గురక సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇంకా అధిక బరువు కూడా గురకకు కారణంగా చెప్పవచ్చు. కాబట్టి బరువు తగ్గెందుకు రోజు వ్యాయామం చేయాలి. ఇంకా ముక్కు ద్వారాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా గురక ను తగ్గించవచ్చు. అయితే ఈ జాగ్రత్తలు గురక కొద్దిగా ఉన్నప్పుడూ పని చేస్తాయి. కానీ గురక సమస్య దీర్ఘకాలికంగా ఉంటూ దాని తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఎంతో మేలు.

Also Read:ఆ పాత్రలకు కూడా కృతి శెట్టి ఓకే

- Advertisement -