తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును చెప్పేశాడు అల్లు అర్జున్. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్ అతిథిగా వెళ్ళాడు. ఆ క్రమంలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన తర్వాత బన్నీ మాట్లాడుతూ నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అల్లు అర్జున్ కి ఓ హీరోయిన్ తరుచూ ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉందట. అల్లు అర్జున్ కి క్లోజ్ అవ్వడానికి ఆ బ్యూటీ ట్రై చేసిందని టాక్. దీంతో స్నేహా రెడ్డి ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి.. ‘ఇంకోసారి బన్నకి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చిందని ఫిలిం సర్కిల్ లో టాక్ నడుస్తోంది. తన భర్త విషయంలో ఇంత సీరియస్ గా ఉండే స్నేహా రెడ్డి.. ఇప్పుడు బన్నీ ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read:Chiranjeevi:భోళా మ్యూజిక్ మేనియా
ఇక బన్నీ పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. రీసెంట్‌గా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియాతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ వార్త వినిపిస్తోంది. పుష్ప2 సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
Also Read:శ్రీశైలంలో మంత్రి హరీష్ రావు