ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో స్నాక్ ఫెస్టివల్ జరుగుతుందని తెలంగాణ టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశం,మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్ , అమీర్ పెట్ , హైటెక్ సిటీ , ఎం.జి.బి.ఎస్ మెట్రో స్టేషన్ లలో ప్రతి రోజు 3 నుండి 9 గంటల వరకు ఇంటర్నేషనల్ స్నాక్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బుర్ర వెంకటేశం …7 దేశాలు,10 రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత చేపలు, పచ్చళ్ళ ఫెస్టివల్ చేస్తామని చెప్పిన ఆయన ఇళ్లలో మహిళలు తయారు చేసిన పచ్చళ్లను ఈ ఫెస్టివల్ లో ఉంచుతామని చెప్పారు.
మెట్రో రైల్లో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఎన్వీఎస్ రెడ్డి.త్వరలో మెట్రో స్టేషన్ లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.