ఏబీవి ప్రభుతవ్వ డిగ్రీ మరియు పీజీ కాలేజీలో కామర్స్ విభాగములో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆర్ ప్రసన్నకు ఉస్మానియా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం రిటైర్డ్ డీన్ అండ్ ప్రొఫెసర్ ఎం సులోచన పర్యవేక్షణలో ‘ఫిమేల్ బయింగ్ బిహేయియర్ విత్ రిఫరెన్స్ టు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఇన్ జీహెచ్‌యంసీ ఏరియా’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ వారు వాణిజ్య విభాగంలో ఆర్ ప్రసన్నకు డాక్టరేట్‌ను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ.. సౌందర్య ఉత్పత్తుల యొక్క మహిళా వినియోగదారుల కొనుగొలు ప్రవర్తనపై అధ్యయనం.. అలాగే దాని ఫలితాలు మహిళ వినియోగదారుల అవసరాలు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతాయని ప్రసన్న తెలిపారు.అదేవిధంగా ఇది పోటీదారులను వారి దగ్గరికి చేరేలా చేస్తుందని, తద్వరా సౌదర్య ఉత్పత్తుల సరఫరా మరియు డిమాండ్‌కి మధ్య సమతౌల్యానికి దోహదపడుతుందని అన్నారు.
కాగా ప్రసన్న పీహెచ్‌డీ సమయంలో,జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పలు వ్యాసాలను సమర్పించింది మరియు ఆమె వ్యాసాలు వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.