తన ప్రాణాలు పోతాయనే భయానికి గురిచేసిన ఒక భయానక దాడి గురించి ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ గుర్తుచేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన తలపై బలమైన దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయానని, ఆ సమయంలో ఒక తోటి పైలట్ విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారని ఆయన వివరించారు.
తన ప్రాణాలను కాపాడుకోవడానికి తాను పడిన ఇబ్బందిని, ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత తన మదిలో ఎలా మెదిలిందో తెలిపారు.తలకి బలమైన దెబ్బ తగలడం నుండి, డోర్ తెరిచినప్పుడు జనం కేకలు వేయడం వరకు, ఆ సంఘటనలో జరిగిన గందరగోళాన్ని, భయానక వాతావరణాన్ని కెప్టెన్ వెల్లడించారు. అలాగే ఇద్దరు తోటి పైలట్లు రెండు విభిన్నరీతుల్లో స్పందించారని, ఒకరు ప్రార్థన చేయగా, మరొకరు విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారని, దాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని మచ్ఛార్ తెలిపారు.
తాను బతకలేనేమో అనిపించిన క్షణం ఏదైనా ఉందా అని అడగగా, అలాంటి క్షణం వచ్చిందని మచ్ఛార్ చెప్పారు.అవును, అలాంటి పరిస్థితిని నేను గ్రహించిన క్షణం ఒకటి ఉంది” అని ఆయన తెలిపారు. “స్మిత్, ఏదో ఒకటి చేయి, నువ్వు ఇలా చావలేవు అని తను తనతోనే అనుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.నేను నా చావును అంగీకరించానని చెప్పడం లేదు. ఏదో ఒకటి చేయి, లేకపోతే…” అని ఆయన మరింతగా వివరించారు.
తన విధులను నిర్వర్తిస్తున్న సమయంలో తన తలపై బలంగా కొట్టారని కెప్టెన్ గుర్తుచేసుకున్నారు. ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆయన స్పృహ కోల్పోతూ, తేరుకుంటూ ఉన్నారు.నేను నా పని చేసుకుంటున్నాను, నా తలపై బలంగా ఏదో తగిలింది. ఏదో చాలా బలమైన వస్తువుతో కొట్టినట్లు అనిపించింది. నాకు కొద్దిసేపు స్పృహ తప్పింది, మళ్లీ వచ్చింది అని చెప్పారు.
Also Read:అభిజిత్‌కు కండిషనల్ బెయిల్

