ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొబైల్ చేతిలో లేనిదే ఏ పని గడవని పరిస్థితి. నేటి రోజుల్లో ప్రతి అవసరం కూడా మొబైల్ తో ముడిపడి ఉండడంతో మనకు తెలియకుండానే మొబైల్ మనలో భాగమైపోయింది. అయితే మొబైల్ పట్ల కొన్ని అజాగ్రత్తల కారణంగా తక్కువ రోజుల్లోనే పాడైపోతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మొబైల్ చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్ లో ఫోన్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం !
మొబైల్ ఎప్పుడు మనతో పాటే ఉండడం వల్ల ఈ సీజన్ లో వర్షంలో తడిసే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ లోకి నీరు చేరితే చాలా త్వరగా డెడ్ అవుతుంది. ఫలితంగా వేలు పెట్టి కొన్న ఫోన్ మార్చి మళ్ళీ కొత్తది తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మొబైల్ వర్షంలో తడవకుండా వాటర్ ఫ్రూఫ్ కవర్స్ ను మొబైల్ కు ఉపయోగించడం చాలా సేఫ్. మనం ఎంత జాగ్రత్త తీసుకున్న మొబైల్ లోకి ఎంతో కొంత వాటర్ వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడు మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసి కాటన్ క్లాత్ తో మొబైల్ మొత్తం క్లీన్ గా తుడవాలి. ఇంకా మొబైల్ లోని చార్జింగ్ పోర్ట్ లేదా స్పీకర్ గ్రిల్, మైక్ వంటి ప్రదేశాలలో వాటర్ చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువ.
Also Read:నిద్రపోయే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..జాగ్రత్త!
అవి సున్నితమైన కంపోనెన్స్ కాబట్టి త్వరగా పాడౌతాయి. అలాంటప్పుడు మొబైల్ ప్యానల్ రిమూవ్ చేసి ఫ్యాన్ గాలి లో ఉంచాలి. కొంతమంది చార్జింగ్ పోర్ట్ లేదా స్పీకర్ గ్రిల్ లోకి వాటర్ చేరినప్పుడు నోటితో ఊదుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ వాటర్ మొబైల్ లోని లోపలి బాగాల్లోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయకూడదు. ఇంకా మరికొంత మంది మొబైల్ వానలో తడిసిన అలాగే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మొబైల్ త్వరగా పాడవుతుంది. ఇక మరికొందరైతే మొబైల్ వానలో తడిసినప్పటికి ఆ వాటర్ ను ఏ మాత్రం తుడవకుండా అలాగే చార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలంలో మొబైల్ పట్ల కనీసపు జాగ్రత్తలు పాటిస్తే వాటి యొక్క లైఫ్ ఎక్కువగా రోజులు ఉండే అవకాశం ఉంది.
Also read:పిక్ టాక్ : ఉఫ్.. సొగసుల విధ్వంసం