కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత

6
- Advertisement -

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొద్ది నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో ఆస్పత్రిలో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆగస్టు 28న డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామను కన్నుమూశారు.

1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ…2017 మార్చిలో బీజేపీలో చేరారు.

Also Read:అందరూ ఇష్టపడే ఆహారం ఏంటో తెలుసా?

- Advertisement -