ఆదిలాబాద్ జిల్లా ముధోల్లో గ్యాస్ కొరత కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కలచివేస్తున్నాయి. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశంలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో, సాధారణ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.
గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జనసందోహాన్ని తగ్గించేందుకు, కొందరు తమ చెప్పులను వరుసగా పెట్టి క్యూను సూచిస్తూ వేచి ఉండడం గమనార్హం. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉదయం వేళనే గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరుకున్న ప్రజలు, తమ వంతు కోసం చెప్పులను వరుసలో ఉంచి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సరఫరా తక్కువగా ఉండటంతో అందరికీ సిలిండర్లు అందడం లేదు. దీంతో మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
గ్యాస్ కొరత కారణంగా గృహాల్లో వంట సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయంగా కట్టెలు, ఇతర ఇంధనాలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరాను పెంచాలని కోరుతున్నారు.
Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

