తమన్నా పై చెప్పు దాడి

77
tamannah

సాధారణంగా హీరోయిన్లను చూస్తే ఎవరికైనా ఓ సెల్పీ దిగాలనిపిత్తది.. ఒక్క ఆటో గ్రాఫ్ తీసుకోవాలనిపిస్తది.. కానీ హైదరాబాద్ లో ఓ వ్యక్తి మాత్రం  స్టార్ హీరోయిన్ పైకి చెప్పు విసిరాడు.. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా..? మిల్క్ బ్యూటీ తమన్నా..

tamannaha

హైదరాబాద్ లో ఓ నగల దుకాణం ఓపెనింగ్ కు హాజరైంది మిల్కీ బ్యూటీ. అదిరిపోయే చీరకట్టుతో చూడగానే ముద్దొచ్చే రూపంతో ప్రారంభోత్సవానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రిబ్బన్ కటింగ్ అయిపోయింది. బయటకొచ్చి మీడియా ముందు, జనాల ముందు నాలుగు మాటలు మాట్లాడితే కార్యక్రమం పూర్తయిపోతుంది.మైక్ పుచ్చుకున్న తమన్న ముద్దుముద్దుగా మాట్లాడ్డం ప్రారంభించింది. అంతే, సడెన్ గా ఆమె పైకి ఎక్కడ్నుంచో ఓ షూ ఎగురుకుంటూ వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ షూ ఆమెపై పడలేదు. బౌన్సర్ల ముందు పడింది. వెంటనే తేరుకున్న బౌన్సర్లు, పోలీసులు అక్కడే ఉన్న కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పు విసిరిన కరీముద్దన్ అనే వ్యక్తి బీటెక్ విద్యార్థిగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం క్వీన్ తెలుగు రీమేక్‌లో లీడ్ రోల్ పోషిస్తోంది. నీలకంఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కల్యాణ్‌రామ్, తమన్నా కాంబోలో వస్తున్న నా నువ్వే మూవీ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.