సుకుమార్ దర్శకత్వంలో చిరు..?

221
sukumar-chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో త్వరలో మూవీ తెరకెక్కబోతోందని ఓ గాసిప్ జోరుగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ సుకుమార్ దాదాపు అరగంట పాటు ఓ స్టోరీని వినిపించాడని, ఈ స్టోరి విన్న చిరంజీవి ఎగ్జయిట్ గా ఫీలయ్యాడని, స్టోరిని డెవలప్ చేయమని సూచించినట్టు తెలుస్తోంది. తన కథలతో హీరోలను ఒప్పించడం సుకుమార్ కు వెన్నతో పెట్టిన విద్య.

chiru - sukumar

నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్, వన్-నేనొక్కడినే సినిమాలో మహేష్ నటించారంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ సత్తానే.ప్రస్తుతం సైరా సినిమా పనులతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ మూవీ కంప్లీట్ అయితే తప్ప తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోడు. మరోవైపు లిస్ట్ లో బోయపాటి ఉండనే ఉన్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి హీరోగా బోయపాటి సినిమా ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్టును కూడా పక్కనపెట్టి సుకుమార్ కు చిరంజీవి అవకాశమిస్తాడేమో చూడాలి.ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -