దిండు లేకుండా నిద్రపోతే ఏం జరుగుతుంది..?

238
- Advertisement -

తలకింద దిండు పెట్టుకోకుండా నిద్రపోవాలంటే చాలామంది కష్టం ఫీలౌతుంటారు. ఎక్కువమంది దిండు ఉంటేనే చాలా మంది నిద్రపోతారు. కొందరైతే దిండు లేకపోతే తమకు మెడ నొప్పి వస్తుందని, అసౌకర్యంగా ఉంటుందని చెబుతారు.

అయితే నిజానికి మీకు తెలుసా..? ఎవరైనా కూడా తలకింద దిండు లేకుండా నిద్రిస్తేనే మంచిదట. దీంతో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి తల కింద దిండు పెట్టుకోకుండా నిద్రిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. తల కింద దిండు లేకుండా నిద్రిస్తే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. కొత్తగా అవి ఏర్పడవు కూడా. ఎలాగంటే.. దిండుపై తలపెట్టి పక్కకు నిద్రించినప్పుడు మన ముఖం దిండుకు ఆనుకుంటుంది. దీంతో దిండుపై ఉండే బాక్టీరియా మన ముఖంపై చేరి ముడతలు, మచ్చలను కలిగిస్తుంది. కనుక దిండు లేకుండా నిద్రిస్తే బాక్టీరియా చేరేందుకు అవకాశం ఉండదు. దీంతో ముఖంపై మచ్చలు రాకుండా, ముడతలు పడకుండా చూసుకోవచ్చు.

Sleeping Without a Pillow Benefits...

2. తరచూ వెన్ను నొప్పి బాధిస్తుంటే అలాంటి వారు తల కింద దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. దీంతో వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. అది తన సహజసిద్ధమైన షేప్‌లోకి వస్తుంది. ఈ క్రమంలో వెన్ను నొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు.

3. దిండుపై తల పెట్టి నిద్రిస్తేనే నిద్ర చక్కగా పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అసలు దిండు లేకుండా నిద్రిస్తేనే నిద్ర బాగా పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దిండు లేకుండా నిద్రించడం వల్ల నిద్ర లేమి సమస్య దూరమవుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

4. దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకుంటే దాంతో నిత్యం కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మానసిక ఆందోళన తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

5. దిండు లేకుండా రోజూ నిద్రిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు మెదడు చురుగ్గా మారుతుందట. యాక్టివ్‌గా ఉంటారని సైంటిస్టులు తెలియజేస్తున్నారు.

6. దిండు లేకుండా నిద్రించడం వల్ల మెడ, భుజాల నొప్పులు తగ్గుతాయి.

- Advertisement -