ఆయన లేకపోతే….మహేష్‌ లేడు

246
Endless Bond Between Mahesh & Pattabhi
- Advertisement -

త‌న ద‌గ్గర ప‌నిచేసే సిబ్బంది బాబోగులు చూడ‌డంలో కృష్ణ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఏళ్ల త‌ర‌బ‌డి త‌న‌ను న‌మ్ముకొన్న వ్యక్తుల‌ను.. త‌న వాళ్లుగా చూసుకొంటారు. కృష్ణ వ్యక్తిగ‌త‌ మేక‌ప్‌ మెన్‌..కి ఇప్పటికీ నెల నెల జీతం వెళ్తుంటుంది. కృష్ణ సినిమాలు చేయ‌క‌పోయినా స‌రే. ఈ విష‌యంలో తండ్రి ల‌క్షణాల‌ను అక్షరాలా పుణికి పుచ్చుకొన్నాడు మ‌హేష్‌ బాబు. తండ్రిలాగే త‌న సిబ్బంది మంచి చెడుల‌ను ద‌గ్గరుండి గ‌మ‌నిస్తుంటారాయ‌న‌.

ఇప్పుడిదంతా ఎందుకంటే ఇటీవల మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘భరత్‌ అనే నేను’ ప్రచార చిత్రాన్ని తొలి పోస్ట్‌గా అభిమానులతో పంచుకున్న మహేష్‌ తాజాగా తను బాలనటుడిగా ఉన్నప్పుడు తండ్రి కృష్ణ, మేకప్‌మ్యాన్‌ పట్టాభితో కలిసి దిగిన ఫొటో గురువారం రాత్రి మహేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పట్టాభితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Endless Bond Between Mahesh & Pattabhi

ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌తో ఫొటోకు పోజిచ్చా (స్మయిల్‌ సింబల్స్‌). గత 24 ఏళ్లుగా ఆయన నాతోనే ఉన్నారు. ఆయన లేకుండా కెమెరాను ఫేస్‌ చేయలేను. ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేయలేదు. నాకిష్టమైన కలర్‌ బ్లూలో మై మ్యాన్‌ పట్టాభి (స్మయిల్‌ సింబల్స్‌)’ అంటూ మహేశ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

గతంలో ప‌ట్టాభి తన గృహ ప్రవేశానికి మ‌హేష్‌ని ఆహ్వానించాడు. కానీ అదే స‌మ‌యంలో మ‌హేష్ సింగ‌పూర్‌ లో సెల‌వ‌ల‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప‌ట్టాభి కోసం… ఓ రోజు ముందే హైద‌రాబాద్ తిరిగిచ్చాడు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ప‌ట్టాభి ఇంటికెళ్లి.. ప‌ల‌క‌రించి వ‌చ్చాడు. మ‌హేష్ రాక‌తో అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. తాజాగా పట్టాభితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు మహేష్‌.

- Advertisement -