ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రింబవళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు సహాయక సిబ్బంది. తొలిసారి టీబీఎంను దాటి మొదలైంది అన్వేషణ. జీపీఆర్ పరికరంతో పలు అనుమానిత ప్రాంతాలను గుర్తించారు.
మొత్తం 13.85 కిలోమీటర్ల టన్నెల్లో సహాయక బృందాలు ఉండగా శుక్రవారం 13.61 కిలోమీటర్లను దాటాయి. శిథిలమైన టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం)ను దాటి లోనికి వెళ్లాయి. లోపల 9.2 మీటర్ల వెడల్పుతో ఉన్న టన్నెల్‌లో ఐదున్నర అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు గుర్తించారు.
మట్టి దిబ్బదలు, బురదలో చిక్కున్న వారు ఇన్ని రోజులు ఊపిరితో ఉండగలరా అనే అనుమానం నెలకొంది. టన్నెల్ లో చిక్కుకున్న కార్నికుల కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచరులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read:TTD:స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ
GPR పరికరంతో సేకరించిన చిత్రాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెత్తని భాగాలను గుర్తించిన ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.సోషల్ మీడియాలో కార్మికుల ఆచూకీపై వస్తున్న వదంతులను నమ్మొద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.