హైదరాబాద్ అభివృద్ధి..ఆకాశమే హద్దు

414
- Advertisement -

గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షియన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో పరుచుకున్న పచ్చందాలు. వెరసీ ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన ఈ మహా నగరం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా, శరవేగంతో అభివృద్ధి చెందుతున్నది. ఫలితంగా హైదరాబాద్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును సొంతం చేసుకుంది.

hyderabad development

తెలంగాణలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానంతో అంతర్జాతీయ కంపెనీలు క్యూకట్టాయి. ఓ వైపు అభివృద్ధి మరోవైపు చారిత్రక కట్టడాల నిర్మణాలతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది హైదరాబాద్. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్‌ ఐకాన్‌గా నిలవగా కొత్తగా నిర్మిస్తోన్న సచివాలయం రాజకోటను తలపించేలా ఉంది. సచివాలయం చుట్టు ఉన్న ప్రాంతాలను సరికొత్తగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త సచివాలయం నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చే సమయానికి హుస్సేన్‌సాగర్‌ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నారు.

లుంబినీ పార్కు ముఖంగా, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండే సచివాలయానికి ముం దుభాగంలో నీటితో కూడిన సాగరతీరం కనిపించేలా సరికొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. సాగర్‌ తీరంలో 278 ఎత్తులో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. సచివాలయం ముందున్న లుంబినీపార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఆ పక్కనే 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహం, లుంబినీ పార్కు పక్కనే నిర్మాణంలో అమరవీరుల స్థూపం ఇలా హైదరాబాద్‌కు మరింత అందాలను తేనుంది.

ఆకాశమే హద్దుగా జరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ సైతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు భారీ భవంతులను నిర్మిస్తున్నాయి. దాదాపు 40 ఫ్లోర్లు ఉన్న భవనాల నిర్మాణాలు జరుగుగున్నాయి. దీనికి తోడు గ్రిడ్‌ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు తలెత్తకుండా విద్యుత్తు ఐలాండ్ నిర్మాణం జరుగుతోంది. ఈ ఐలాండ్‌ పరిధిలోని 400 కేవీ సామర్థ్యం ఉన్న 7 సబ్‌స్టేషన్లు, 220 కేవీ సామర్థ్యం ఉన్న 17 సబ్‌స్టేషన్లు, 132 కేవీ సబ్‌స్టేషన్లు 44 నిరంతరాయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో హైదరాబాద్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -