సూర్యపేటకు వృత్తి నైపుణ్యం కేంద్రం మంజూరు

61
- Advertisement -

సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి తీపి కబురు.వృత్తి నైపుణ్యం కొరకు హైదరాబాద్ లో ఉన్న న్యాక్ (నిర్మాణ రంగంలో మేలుకవలలో జాతీయ శిక్షణా కేంద్రం)వరకు వెళ్లే అవసరం లేకుండానే సూర్యపేటలో వృత్తి నైపుణ్యం కేంద్రాన్ని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యపేట కు వృత్తి నైపుణ్యం కేంద్రాన్ని మంజూరు చేస్తూ జీ ఓ జారీ చేశారు. ఈ మేరకు 10 కోట్లు విడుదల చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాటుతో సూర్యపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి అధినేత అండతో మెడికల్ కళాశాల, సమీకృత మార్కెట్ సముదాయాలు, సమీకృత కలెక్టర్ కార్యాలయం తో పాటు సూర్యపేట జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే.

ఒక వైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిని సాదిస్తూనే జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యపేటను అభివృద్ధిలో రోల్ మోడల్ గా మార్చేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులైన యువత శిక్షణ కోసం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో ఉన్న న్యాక్ (నిర్మాణ రంగంలో మేలుకవలలో శిక్షణా కేంద్రం)దాకా వెళ్లకుండా సూర్యపేటలో ఏర్పాటు చేయడం సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఊరట కలిగించే అంశం.ఈ అంశం పై ప్రత్యేక శ్రద్ద చూపించి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి వృత్తి నైపుణ్యం కేంద్రాన్ని మంజూరు చెయ్యడమే కాకుండా అందుకు అవసరమైన 10 కోట్ల నిధులను మంత్రి జగదీష్ రెడ్డి మంజూరు చేయించడాన్ని సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు స్వాగతిస్తూన్నారు .

ఇవి కూడా చదవండి..

- Advertisement -