తలసానిని కలిసిన శివాజీ రాజా,నరేష్..

181
Sivaji Raja & Naresh Meets Talasani
- Advertisement -

‘ మా’ పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న – సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

‘ మా ‘ అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల ‘ మా ‘ సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటివల శివాజీ రాజా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ పార్టీ లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి సభ్యులందరు ఏకగ్రీవంగా ‘ మా ‘ అధ్యక్షులుగా శివాజీ రాజా , జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ప్రతిపాదించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం సినిమటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి విషెస్ అందుకున్నారు.

Sivaji Raja & Naresh Meets Talasani

మంత్రి తలసానిని కలిసిన శివాజీ రాజా, నరేష్ లు ‘ మా ‘ పేద కళకారులకు పెంక్షన్ , ఇళ్ల నిర్మించాలని కోరారు. దీనికి స్పందిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ – ” ‘ మా ‘ అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటీగా నరేష్ లు ఉండాలనే నిర్ణయాన్ని దర్శకరత్న దాసరి నారాయాణరావు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.ఈ మేరకు మేము అంగీకరించామని శివాజీ రాజా, నరేష్ లు పాత్రీకేయుల సమావేశంలో తెలియజేశారు. శివాజీ రాజా, నరేష్ లు అడిగిన అంశాలన్నింటికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తుంది. పేద కళకారులకు పెంక్షన్, ‘ మా’ అసోసియేయన్ సొంత భవనం ఏర్పాటు చేసుకోవడానికి మా ప్రభుత్వం సహాయ సహాకారలను అందిస్తుందిన్నారు. చిత్ర పరిశ్రమకి సంబంధించి ఎలాంటి సహాయాన్ని చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. త్వరలో నే ‘ మా ‘ సభ్యులందర్ని సీఎం కేసీఆర్ తో మాట్లాడిస్తా” అన్నారు.

దాసరిని పరామర్శించిన శివాజీ రాజా, నరేష్…

Sivaji Raja & Naresh Meets Talasani

ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న డా. దాసరి నారాయాణరావుని శుక్రవారం ఉదయం నటులు శివాజీ రాజా, నరేష్ లు పరామర్శించారు. గతంలో ఆయన చెప్పిన విధంగానే ‘ మా ‘ అసోసియేషన్ అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటీగా నరేష్ లు మొట్ట మొదటి సారిగా ఆయనే ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

- Advertisement -