రాజమౌళి ఓ మాట అన్నారు…

223
- Advertisement -

రమ్యకృష్ణ ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో రమ్యకృష్ణ ఎక్కువ కష్టపడింది. తను అనేక భాషల్లో చిత్రాలను చేశారు. అందులో హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. తనకెప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు రాలేదని.బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఆ గుర్తింపు దక్కిందని శివగామి పాత్ర గురించి చెప్పారు.అంతేకాదు..బాహుబలి సినిమాలో తను ఎదుర్కొన్న పరిస్థితులను,తనకు లబించిన గుర్తింపును వివరించారు… నేను ఎక్కడికి వెళ్లినా, అది విదేశాలు కావచ్చు.. ఉత్తరభారతం కావచ్చు.. నాకు తెలియని వాళ్లుందరూ నా దగ్గరకు వచ్చి శివగామి అంటున్నారు. ‘బాహుబలి’ భౌగోళిక సరిహద్దులను చెరిపేసింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చిత్ర ప్రచారంలో భాగంగా రమ్యకృష్ణ మాట్లాడారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో మీరు చూసింది కేవలం పాత్రల పరిచయం మాత్రమే. ఇందులో దేవసేన, శివగామి పాత్రల మధ్య ఒక్క సన్నివేశం కూడా ఉండదు. అసలైన డ్రామా ‘బాహుబలి2’లో ఉంటుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అసలు కథ అంతా ‘..కన్‌క్లూజన్‌’లోనే ఉంది. మీ అంచనాలకు మించి రెండో భాగం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.చిత్ర ప్రచారంలో భాగంగా రమ్యకృష్ణ మాట్లాడారు.

Sivagami Ramyakrishna Talk About Baahubali

‘బాహుబలి: ది బిగినింగ్‌’లో తాను ఎక్కువ కష్టపడింది నదిలో మునిగి చేతితో బిడ్డను పైకెత్తి పట్టుకున్న సన్నివేశానికేనని అన్నారు రమ్యకృష్ణ. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకమైన రాజమాత శివగామి పాత్రను పోషించారు. తొలిభాగంలో తనదైన నటనతో అలరించి విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక రెండో భాగంలో రమ్యకృష్ణ పాత్ర మరింత కీలకమని సమాచారం. ముఖ్యంగా శివగామి పాత్ర ప్రాణత్యాగం చేయడానికి కారణమేమిటా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Sivagami Ramyakrishna Talk About Baahubali

ఈ గొప్పతనం అంతా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికే దక్కుతుంది. నా పాత్ర గురించి ఆయన చెప్పిన విధానానికి నాకు ఒళ్లు గగుర్పొడిచింది. కథ చెప్పేటప్పుడే నేను శివగామిలా ఫీలైపోయా. సాధారణంగా దర్శకుడు ఎవరైనా కథ చెప్పేటప్పుడు నాకు కునికిపాట్లు వస్తుంటాయి. నాకు తెలిసి తొలిసారి కథ చెబుతున్నప్పుడు నిద్రపోకుండా విన్నది బహుశా ఇదేనేమో. రెండు గంటల పాటు కనీసం కళ్లు రెప్పలు కూడా వేయలేదు. ప్రతీ షాట్‌, ప్రతీ సన్నివేశం రాజమౌళి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు ఆ దృశ్యాలన్నీ నా కళ్ల ముందు మెదిలాయి. ఆయన విజన్‌ చూసి చాలా థ్రిల్లింగ్‌కు గురయ్యా. అదే నన్ను శివగామి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేలా చేసింది. ఈ పాత్ర కోసం నేను ఏవిధంగానూ సన్నద్ధం కాలేదు. రాజమౌళి చెప్పినట్లే చేశా. ఆ పాత్రలో నేను తప్ప మరొకరిని వూహించుకోలేదు. చివరకు శివగామిలా మారిపోయా! రాజమాత శివగామి పాత్రలో రాజసం ఉట్టి పడాలి. అందుకు ప్రత్యేకమైన దుస్తులను తయారు చేశారు. ఆ దుస్తులు, నగలు ధరించగానే నా శరీర భాష పూర్తిగా మారిపోయేది. వెంటనే రాజమాతగా మారిపోయేదాన్ని.మరి అనుష్క నుంచి ఏమి ఆశిస్తామో ఆ నటన వచ్చేస్తుంది. చాలా మంచి నటి కష్టపడుతుంది. అలాంటి వారిని అందుకోవటం చాలా కష్టం. ఆమే కాదు చిత్ర బృందమంతా చాలా పాజిటివ్‌గా పనిచేసేవారు. ఐదేళ్ల పాటు ఈ చిత్రం కోసం పనిచేశాం.

Sivagami Ramyakrishna Talk About Baahubali

బాహుబలి తొలి భాగానికి సంబంధించి ఎవరికైనా ఎప్పటికైనా గుర్తుండిపోయేది నీటిలో మునిగి పసిబిడ్డను పైకెత్తి పట్టుకునే సన్నివేశం. ఇది నాకు అత్యంత సవాల్‌ను విసిరిన సన్నివేశం అనే చెప్పాలి. దీనిని కేరళలో ప్రఖ్యాతిగాంచిన చల్లకుడి జలపాతం వద్ద వారం రోజుల పాటు చిత్రీకరించారు. అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంటుంది. సుడులు తిరుగుతూ ప్రవహించే ఆ నీళ్లలోకి నేను మునిగి చేయి పైకి పెట్టి ఉంచాలి. నీటి వేగం నన్ను అటూ ఇటూ లాగేస్తూ ఉండేది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. ఆ సమయంలో రాజమౌళి ఓ మాట అన్నారు. ‘శివగామి ముఖంలో నేను భయాన్ని చూడకూడదు. ఏం జరిగినా పట్టించుకోకూడదు’ అన్న మాటతో భయాన్ని పక్కన పెట్టేశా. నీటిలో మునిగినప్పుడు తీవ్ర భయబ్రాంతులకు గురైనా పైకి లేచే సరికి నా ముఖంలో భయం కనపడేది కాదు. నాలోని భయాన్ని బయటకు కనిపించనిచ్చేదాన్ని కాదు. ఇదే తొలి భాగంలో నాకు అత్యంత సవాల్‌ను విసిరిన సన్నివేశం

- Advertisement -