అతిగా కూర్చుంటే…అనర్థమే

255
- Advertisement -

ఉదయం లేచిన తరువాత వివిధ పనుల్లో నిమగ్నమౌతుంటాం. కానీ కొంతమంది మహిళలు ఇంట్లోనే ఉంటుంటారు. పెద్దగా శ్రమ లేకుండా కూర్చుని చేసే పనితో శరీరానికి నష్టం ఏముంటుంది? అని చాలామంది భావిస్తుంటారు. కానీ రోజులో ఎక్కువ భాగం కూర్చొని పనిచేసే వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడూ కూర్చుని ఉండే వాళ్ళకు డిస్కుల అరుగుదల ఎక్కువగా ఉండడంతో పాటు వెన్నుపూస డిస్కుల మీద శరీర భారమంతా పడి ఆ డిస్కులు త్వరగా క్షీణిస్తాయి. మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశ ఉందని, ఇలా కాకుండా గంటల కొద్ది కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటు ఇటు తిరగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు.

చాలా సేపు నిల్చోవడం వల్ల నడుం సమస్య వస్తుందని అంటుంటారు. ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కూడా నడుం సమస్య వస్తుంది. ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల డయాబేటిస్ సమస్య వస్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా భవిష్యత్ లో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మహిళల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి అడ్రినల్‌ గ్రంధులు దోహదపడతాయి. కార్డిసోల్‌ని ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని ప్రభావం వల్ల బరువు పెరుగుతారట.  శారీరకంగా శ్రమ కలిగించని వారు ఇట్టే బరువు పెరుగుతారు. పైగా ఎప్పుడూ బద్దకంగానూ, నీరసంగానూ ఉంటారు. ఇలాంటి వారు తొందరగా బరువు పెరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. వీరు తమని తాము ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. కాబట్టి.. మహిళలు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రయత్నించాలి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు చక్కని సంగీతం వినడం, లేదా కామెడీ సన్నివేశాలు చూడ్డం లాంటివి చేయాలి.

వీలైతే నడక, సైక్లింగ్‌ చేస్తే కొంతవరకూ ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అలా కాకుండదంటే నడుముకు సంబందించిన వ్యాయామాలు తప్పకూండా చేసి తీరాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు . వ్యాయామాలు చేయడం వల్ల శరీర భాగాలన్నీ భారాన్ని పంచుకుంటాయి కాబట్టి వెన్నుపూస, డిస్కుల మీద ఒత్తిడి తగ్గి కొంత రిలీఫ్‌ దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతకాలంలో మనం ఎక్కువగా రసాయనిక ఆహారం తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువగా వెన్నునొప్పులతో బాధపడే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. వీలైతే నడక, సైక్లింగ్‌ చేస్తే కొంతవరకూ ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:రత్నంగా మారిన విశాల్!

- Advertisement -