ఎరువు కొరత నిజమే: పొన్నం

15
- Advertisement -

ఎరువుల కొరత ఉన్న మాట వాస్తవం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొంత మంది రైతులు ఉత్సాహంతో ముందస్తు స్టాక్ పెట్టుకోవడం వల్ల ఎరువుల కొరత ఏర్పడింది అన్నారు. మీడియాతో మాట్లాడిన పొన్నం… తెలంగాణ రైతాంగం బీజేపీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరముంది అన్నారు.

కేంద్రంలో ఉన్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు … రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉండి కూడా ఎరువుల సరఫరా విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు అన్నారు. ఎరువులకు సంబంధించి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.

రైతులు రోడ్ల వెంట తిరిగే పరిస్థితి కల్పించిందే కేంద్రంలో ఉన్న బీజేపీ అన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే విధంగా ప్రయత్నించండి… రైతులకు అండగా నిలబడే పార్టీగా కాంగ్రెస్ ఈ అంశంపై డిమాండ్ చేస్తోంది అన్నారు.

Also Read:మన శంకరవరప్రసాద్ గారు..అప్‌డేట్

- Advertisement -