- Advertisement -
లోక్ సభా కార్యకలాపాల తేదీలు ప్రకటించింది కేంద్రం. రెండు దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాలు తేదీలు, సమయం అధికారికంగా ప్రకటించింది. ఈనెల 29 నుంచి శని, ఆదివారాలు మినహా అన్ని రోజులు సభ జరుగుతుంది అని వెల్లడించింది.
జనవరి 29 ఉదయం 11గం.లకు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఉభయ సభల సమావేశం జరగనుంది. అనంతరం అరగంట పాటు లోకసభ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలు పెట్టనుంది ప్రభుత్వం.
ఫిబ్రవరి 1న ఉదయం 11గం.లకు లోకసభ సమావేశాలు జరగనుండగా 2021-22 ఏడాదికి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ఉదయం 11గం.ల నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గం.ల నుంచి 9గం.ల వరకు లోకసభ సమావేశాలు జరగనున్నాయి.
- Advertisement -