మే 24న విడుదలకానున్న ‘సీత’..

604
- Advertisement -

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం `సీత`. వీరిద్దరూ జంటగా రెండోసారి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 24న విడుద‌ల‌వుతుంది. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగ‌టివ్ రోల్ చేస్తున్నారు.

Hero Bellamkonda Sai Sreenivas

ఇక ఈ మూవీలో పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుండి ఈ స్పెష‌ల్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త షేడ్‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ని అప్రిసియేష‌న్స్ వ‌చ్చాయి. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నారా చోప్రా, సోనూ సూద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అభిన‌వ్ గోమ‌టం, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు..

- Advertisement -