సిట్ విచారణకు హాజరైన ముమైత్…

209
SIT interrogate Mumaith Khan
- Advertisement -

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ విచారణకు హాజరైంది నటి ముమైత్ ఖాన్. చా ర్మి మాదిరిగానే ముమైత్‌ఖాన్‌ ను కూడా సిట్ అధికారుల నేతృత్వంలో నలుగురు మహిళా అధికారుల బృందం ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలు వివరాలు సేకరించిన సిట్ అధికారులు ముమైత్ ను అడగాల్సిన ప్రశ్నలపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.

డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, సరఫరా, ఎవరెవరికి చేరుతోంది.. అనే అంశాలపై సిట్ ప్రశ్నించనున్నట్టు తెలిసింది. అంతేగాక, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్.. ముమైత్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

SIT interrogate Mumaith Khan
బుధవారం నటి చార్మిపై ఓ కానిస్టేబుల్ చేయి వేసి అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలైన నేపథ్యంలో ముమైత్ ఖాన్‌ను సిట్ కార్యాలయంలోపలికి తీసుకెళ్లేందుకు మహిళా పోలీసులనే ఎక్కువగా నియమించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో భాగంగా మొదట్లో ఆమెకు నోటీసులిచ్చేందుకు ఎక్సైజ్‌ అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. సరైన అడ్రస్‌ దొరకని కారణంగా ఆలస్యంగా నోటీసులిచ్చారు. అయితే ముమైత్‌ బిగ్‌బాస్‌ షోలో ఉండటంతో అసలు సిట్‌ ముందు విచారణకు వస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. చివరికి షో నిర్వాహకుల ద్వారా ఆమెకు నోటీసులు అందజేశారు. డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో సిట్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తేల్చి చెప్పారు. దీంతో ఈ నెల 27న హాజరవుతానని సిట్‌కు సమాచారం ఇచ్చింది ముమైత్. 70 రోజుల బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పటికీ అనుమతి తీసుకొని విచారణకు హాజరైంది.

- Advertisement -