సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత..

42

టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాయి. సిరివెన్నెలను ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. సిరివెన్నెల క్షేమంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని సిరివెన్నెల తనయుడు యోగి తెలిపారు.

రెండు రోజులకు పైగానే సిరివెన్నెల ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందారు. మొదట ఈ విషయమై మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. కాని ఇండస్ట్రీ వర్గాల వారికి తెలియడంతో మీడియా వర్గాలకు కూడా విషయం పొక్కింది. దాంతో సిరివెన్నెల ఆరోగ్యం విషయమై నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.