గ్రీన్ ఛాలెంజ్‌ పాల్గొన్న సిరిసిల్లా అడిషనల్ కలెక్టర్..

139
Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సిరిసిల్లాలోని తన కార్యాలయ ఆవరణలో సిరిసిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్ అంజయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖీమ్యా నాయక్ యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.

ఈ మధ్య కాలంలో జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5 వ స్థానం ఉన్నది అంటే కేసీఆర్ చేపట్టిన హరిత హారం యొక్క ప్రతిఫలం, అయన దూర దృష్టికి నిదర్శనం. దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విజవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎం.పి సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చెట్లు కార్బన్డయాక్సయిడ్ పీల్చుకుని మనకు అక్షిజన్ ఇచ్చి మన జీవితకాలాన్ని పెంచుతున్న చెట్లను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వాటినే కనీసం 3 సంత్సరాలు ఎదిగే బాధ్యత కూడా మనదే అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ కి తమని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురుకి ఆర్.డీ.ఓ శ్రీనివాస రావు సిరిసిల్ల,కౌటిల్య డి.ఆర్.డి.ఓ. సిరిసిల్ల,రవీందర్ డి.పి.ఓ లకు ఛాలెంజ్ చేసి మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను ఇవ్వవలసినదిగా కోరారు.