ధనుష్‌…’సార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

75
dhanush
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో ధనుష్. ప్ర‌స్తుతం ధ‌నుష్ ఐదు సినిమాల్లో నటిస్తుండగా ఇందులో ఒకటి ‘సార్‌’. ద్విభాష చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కింది.

తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌చేశారు. డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. టైబుల్‌పై కూర్చొని స్టూడెంట్స్‌ను క్లాస్ పీకుతున్న‌ట్లు ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధ‌నుష్ జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త మీన‌న్ నటిస్తుండగా జీవి. ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -