పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ఒక ప్రధాన కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సుమారు 90 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించబడటం రాజకీయంగా పెను దుమారం రేపింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.6% మంది ఓటర్లను (సుమారు 90 లక్షలు) జాబితా నుండి తొలగించారు. వీరంతా నకిలీ ఓటర్లని లేదా వలస వెళ్లిన వారని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, ఇది రాజకీయ కుట్ర అని టీఎంసీ ఆరోపించింది.
ఓటర్ల తొలగింపు ఎక్కువగా జరిగిన నియోజకవర్గాల్లో టీఎంసీ ఓటు బ్యాంకు గణనీయంగా దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో మరియు టీఎంసీకి పట్టున్న ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
2021 ఎన్నికల్లో టీఎంసీ 215 స్థానాలను గెలుచుకుంది. అయితే, ఈసారి తొలగించబడిన ఓటర్ల సంఖ్య గతంలో టీఎంసీకి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 90 లక్షల మంది ఓటర్లలో అత్యధికులు టీఎంసీ మద్దతుదారులేనని, వారి తొలగింపు వల్ల బీజేపీకి లబ్ధి చేకూరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం ఓటర్ల తొలగింపు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఉన్న 92.59% భారీ ఓటింగ్ శాతం కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేసింది. నిరుద్యోగం, అవినీతి మరియు మహిళల భద్రతపై నెలకొన్న అసంతృప్తి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించింది. ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు మరియు మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల బీజేపీ 206 స్థానాలతో మేజారిటీ మార్కును సులభంగా దాటగలిగింది.
Also Read:గోదారి గట్టుపైన..ఎంజాయ్ చేస్తారు!

