Single:యుఎస్‌లో ‘సింగిల్’ జోరు!

7
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘సింగిల్’. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని దాటేసి, లాభాల బాట పట్టింది.

ముఖ్యంగా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. అమెరికాలో 700K డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో సింగిల్ చిత్రం కలెక్షన్స్ పరంగా మరింత దూసుకెళ్లడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.

శ్రీవిష్ణు సరసన అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Also Read:అలర్ట్..ఒంటరి వృద్ధులే టార్గెట్!

- Advertisement -