ఈ మధ్య కాలంలో బాగా పాప్యులర్ అయిన వ్యక్తుల్లో తమిళ సినీ గాయని సుచిత్ర ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన పలువురు హీరో, హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు, వీడియోలను లీక్ చేసిన సంచలనం సృష్టించింది సుచిత్ర. సుచీలీక్స్ పేరిట విడుదలైన ఈ ఫొటోలు, వీడియోలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ధనుష్, అనిరుధ్, రానా, ఆండ్రియా, త్రిష, చిన్మయి, హన్సికలాంటి సినీ స్టార్లు సుచిలీక్స్ బాధితులుగా మిగిలిపోయారు.
సుచీ లీక్స్ పెను ప్రకంపనాలతో సినిమా ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే వారం రోజులుగా సుచీలీక్స్‌కి బ్రేక్ పడింది. సింగర్ సుచిత్ర విదేశాలు వెళ్లిపోయిందని ప్రచారం జరిగింది. సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించాడు. అంతేకాదు, వైద్య చికిత్స కోసం విదేశాలకు ఆమెను తీసుకెళుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సుచీ కిడ్నాప్ గురైందన్న వార్తలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. సుచీ కిడ్నాప్ వెనక తమిళ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ఉంటారన్న వాదన వినిపిస్తోంది.
అయితే ఉరుమెళ్లి మెరుపుమీద పడ్డట్టు, ఉన్నట్టుండి మళ్లీ సుచీలీక్స్ ప్రకంపనాలు మొదలయ్యాయి. మళ్లీ ఓ ప్రయివేటు ఫోటో బయటపడింది. ఈసారి బాత్రూమ్‌లో స్నానమాచరిస్తున్న ఓ నటి ఫోటోలు సుచీ ట్విట్టర్‌లో లైవ్ అయ్యాయి. ఈ మంటతోనే కొందరు గ్రూపుగా ఏర్పడి సుచీని కిడ్నాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.