ప్రముఖ మలయాళ నటిపై ఇటీవలే లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులను, సామాన్య ప్రజలను కలిచివేసింది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఈ ఘటనను ఖండిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అంతా భావనకు అండగా నిలుస్తున్నారు.
భావన అత్యాచారతో పలువురు హీరోయిన్స్ కూడా తమకు జరుగుతున్న వేధింపులపై పెదవి విప్పుతూన్నారు. తమకు జరిగి అన్యాయాలను ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇండ్రస్ట్రీలో తమను ఎంతో మంది వేధింపులకు గురిచేశారటు పలువురు హీరోయిన్లు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా ఈలిస్టులో నటి సుచిత్ర కూడా చేరిపోయింది.
కోలీవుడ్ టాప్ యంగ్ హీరో, సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ తనను వేధిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది సుచిత్ర. అంతేకాకుండా ధనుష్ తనపై దాడికి పాల్పడ్డారని తను ట్వీట్ చేసింది. సుచిత్ర చేసిన ట్వీట్ ఇప్పుడు కోలివుడ్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ధనుష్ తన తల్లి తండ్రుల విషయంలో కోర్టు కేసులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో సుచిత్ర ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ధనుష్‌కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.
అయితే ధనుష్ పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసిన సుచిత్ర మీడియా ముందుకు రాకపోవడంతో సుచిత్ర ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధనుష్‌తోపాటు ఆయన సిబ్బంది కూడా దాడి చేశారు. ‘నాపట్ల దారుణంగా ప్రవర్తించారు. నా చేతులపై గాయాలయ్యాయి. అందుకు సాక్షం ఇదిగో’ అంటూ ఫొటోలను ట్వీట్ చేసింది సుచిత్ర.
అంతేకాకుండా ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవన్ పై అభ్యంతకరమైన ట్వీట్ చేసింది సుచిత్ర. అక్కడ భారీ సెక్స్ కుంభకోణం జరుగుతోంది అంటూ సుచిత్ర ట్విట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. అయితే ఈమె ట్వీట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలుసుకుందామని మీడియా వర్గాలు సుచిత్రతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో ఆమె నడిపిన ఈవ్యవహారంపై ట్వీట్స్‌పై అనేక సందేహాల వ్యక్తమవుతున్నాయి.
తమిళ చిత్ర పరిశ్రమలో సుచిత్ర గాయనిగా సుపరిచితురాలు అవ్వడమే కాకుండా ఆమె పాడిన పాటలు కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి. గతేడాది తమిళ కమెడియన్ కార్తీక్ కుమార్‌ను వివాహాం చేసుకున్న సుచిత్ర ఇప్పుడు చేసిన వివాదాస్పద ట్విట్స్ తో సంచలనంగా మారింది. ఇంత వివాదం జరిగిన తర్వాత సుచిత్ర తన ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.