మొక్కలు నాటిన సింగర్ శ్రీరామచంద్ర..

56
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా పుట్టినరోజు పురస్కరించుకుని తన తల్లి జయలక్ష్మి తో కలిసి బోయిన్ పల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ గాయకుడు,ఇండియన్ ఐడల్ విజేత,బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ,నటుడు శ్రీరామ చంద్ర.

ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తన తల్లితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఒక చెట్టుకు జీవం పోసామని ఇది నాతో పాటు పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుందని శ్రీరామ చంద్ర అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి శ్రీరామచంద్ర ధన్యవాదాలు తెలిపారు…

- Advertisement -