సమస్యల పరిష్కారంలో ముందంజలో మహిళా కమిషన్..

49
sathyavathi
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలని, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. గత ఏడాది కాలంగా కమిషన్ బాగా పని చేస్తోందని, మహిళా సమస్యల పరిష్కారం లో దేశంలో మన రాష్ట్ర కమిషన్ ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నేడు బుద్ధ భవన్ లో జరిగిన కమిషన్ వార్షికోత్సవంలో పాల్గొని కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్..రాష్ట్ర మహిళా కమిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గారికి మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా మంచి అనుభవం ఉంది. ఆమె అనుభవం ఈ కమిషన్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ రాష్ట్రంలో మహిళల భద్రత, పోషణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి నేతృత్వంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారి రక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారని తెలిపారు. సమాజంలో మహిళలకు రక్షణ ఉండాలంటే సమాజంలో, ముఖ్యంగా మగవాళ్లలో మార్పు రావాలి. …మహిళల రక్షణ కోసం ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా అక్కడక్కడ జరిగే కొన్ని సంఘటనలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. మహిళా సమస్యల పరిష్కారంలో మన మహిళా కమిషన్ దేశంలో చాలా ముందంజలో ఉందన్నారు.

- Advertisement -