గ్రాండ్‌గా సింగ‌ర్ స్మిత `ఎ జ‌ర్నీ 1999-2019` వేడుక‌లు..

312
- Advertisement -

సింగర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన స్మిత ఈ ఏడాదితో 20 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా `ఎ జ‌ర్నీ 1999-2019` అనే పేరుతో వేడుక‌ను నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె తొలి ఇండిపాప్ కావ‌డం విశేషం. ఈ వేడుక‌కు కింగ్ నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, నేచుర‌ల్ స్టార్ నాని, అల్ల‌రి నరేశ్‌, న‌వ‌దీప్‌, ఎం.ఎం.కీర‌వాణి, క‌ల్యాణి మాలిక్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి, దేవాక‌ట్టా, విష్ణు ఇందూరి ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. సింగర్ కొన్ని పాటలను లైవ్ క‌న‌స‌ర్ట్‌లో పెర్ఫామ్‌ చేసి అతిథులను ఆకట్టుకున్నారు.

smitha

 

1996లో పాడుతా తీయగా కోసం పాటలు పాడటం ద్వారా స్మిత వెలుగులోకి వచ్చారు. అప్పటి నుండి నేటి వరకు అదే ఉత్సాహంతో పాట‌లు పాడుతూ ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తున్నారు. 1999లో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున `యువ‌ర్ హాన‌ర్‌` అనే షో ప్రోమోను ఆవిష్క‌రించారు. ఈ షోకు స్మిత యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ షో ద్వారా స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు.

- Advertisement -