‘అలా అంటే..చెప్పుతో కొడతా’…

458
- Advertisement -

ప్రణవి వాయిస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను చేస్తుంది. అందుకే తెలుగు పాటను పరుగులు తీయిస్తోన్న యంగ్ సింగర్స్ జాబితాలో ‘ప్రణవి’ పేరు కూడా వినిపిస్తుంది. అంతేకాదు.. ప్రణవిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తుంటాయి. అలాంటి ప్రణవి .. కెరియర్ పరంగా తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 Singer Pranavi talk About...

తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ సినిమాకి పాట పాడటానికి వెళ్లాననీ, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని అంది. సినిమాల్లో పాటలు పాడాలనుకుంటే తనతో వుండాలంటూ ఆయన అనడంతో, చెప్పుతీసుకుని కొడతానని తాను హెచ్చరించానని చెప్పింది. అలా వచ్చే అవకాశాలు తనకి అవసరమే లేదంటూ వెనుదిరిగి వచ్చేశానని అంది.

తననే కాదు, తన ఎదురుగా ఆడపిల్లలను ఎవరైనా ఏమైనా అంటే తాను చూస్తూ ఊరుకోననీ .. ధైర్యంగా వెళ్లి వాళ్లను కొట్టేస్తానని చెప్పింది. అందువల్లనే సాధారణంగా తన జోలికి ఎవరూ రారని చెప్పుకొచ్చింది ప్రణవి.

- Advertisement -