తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల ఊల్లాల” చిత్రం లో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడింది. దాంతోపాటు హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది.
నటరాజ్ , నూరిన్ , అంకిత హీరో, హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం “ఊల్లాల ఊల్లాల” . సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్” ఈ చిత్రం ద్వారా దర్శకుని గాపరిచయమవుతున్నారు.. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ . గురురాజ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రంనవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. “మంగ్లీ” కి తెలుగు నాట మంచిపాపులారిటీ ఉంది. ఆమె మా సినిమాలో పాట పాడింది, యాక్ట్ చేసింది, హీరోయిన్నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. ఈ రకంగా మంగ్లీ మా సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గానిలువనుంది. అలాగే బిగ్ బాస్- 2 తో క్రేజ్ తెచ్చుకున్న రోల్ రైడా ఇందులో ఓ పాటపాడడంతో పాటు, ఆ పాటలో నటించారు కూడా. ఇంకా ఈ చిత్రం లో ఇలాంటి విశేషాలుచాలా ఉన్నాయి . భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము . ఇందులో ఎన్నో వింతకా రెక్టర్లు కూడా ఉన్నాయి. మా బేనర్‌లో `రక్షకభటుడు`, `ఆనందం మళ్లీ మొదలైంది`, `లవర్స్ డే` చిత్రాల తర్వాత వస్తున్న సినిమా `ఉల్లాలా ఉల్లాలా`. ఇలాంటి కాన్సెప్ట్ లుచాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగాఅంతకన్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
దర్శకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ- ”ఇదొక రొమాంటిక్ ఎంటెర్టైనింగ్ థ్రిల్లర్. మాఅబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నదుకుచాలా గర్వంగా ఉంది . ఈ సినిమాలో చాలా గొప్ప కంటెంట్ ఉంది . చాలా ఎట్రాక్షన్స్కూడా ఉన్నాయి . ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ కూడా వున్నాయి” అని చెప్పారు.