మొక్కలు నాటిన యువ గాయనీ లిప్సిక

679
singer lipsika
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా రేడియో జాకీ కాజల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటిన యువ గాయని లిప్సిక.

ఈ సందర్భంగా లిప్సిక మాట్లాడుతూ మనం వాతావరణం పరిరక్షణ కోసం నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నారు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చాలెంజ్ తీసుకొచ్చారని మనకు గ్రీనరీ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్లలో మనం నివసిస్తు ఉన్నాం. అయినప్పటికీ మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని కోరారు.

వీలు కుదిరితే మన ఇంట్లోనే చిన్న చిన్న మొక్కలను పెంచుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ను చూసి ప్రజలందరూ చైతన్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలను పెట్టడం జరుగుతుందని. కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాహితి చాగంటి గాయని, VJ షర్మిల యాంకర్ లను ఈ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -