- Advertisement -
టాలీవుడ్‌ను కరోనా షేక్ చేస్తోంది. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడగా తాజాగా సింగర్ కౌసల్య కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది కౌసల్య. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, లక్షణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని తెలిపింది.
రెండు రోజుల నుంచే జ్వరం ఉందని, ప్రస్తుతం కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నానని వెల్లడించింది. కరోనా విజృంభిస్తుండడంతో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొంది.
- Advertisement -