రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.మ్యూజిక్ డైరెక్టర్. జీవన్ బాబు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు అమినపూర్ పార్క్ లో మొక్కలు నాటారు సింగర్ హైమాత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా గోప్ప కార్యక్రమం చేపట్టి మా అందరి చేత మొక్కలు నాటించడం చాలా సంతోషంగా ఉంది అందుకు సంతోష్ గారికి మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ( అనుదీప్ సింగర్.. స్వీకార సింగర్..పూర్ణచేందు. లిరిక్స్ )లను మొక్కలు నాటిన కోరారు.అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమం లో అందరూ పాల్గొని మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు సింగర్ హైమత్.

