భారతీయులకు H-1B వీసాల జారీవద్దు…

266
h1b
- Advertisement -

మార్చి 9 నుండి లాటరీ విధానంలో హెచ్‌- 1బీ వీసాలను జారీ చేయనుంది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ వాయిస్ సంస్థ…ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు కీలక సూచన చేసింది. భారతీయులకు వీసాలు ఇవ్వొద్దని….గ్రీన్ కార్డులపై పరిమితులు ఎత్తివేయాలని సూచించింది.

గ్రీన్ కార్డులపై పరిమితిని ఎత్తేసేదాకా భారతీయులకు కొత్తగా హెచ్1బీ వీసాలను మంజూరు చేయొద్దంటూ బైడెన్‌ను కోరింది. గ్రీన్ కార్డులపై పరిమితి విధించడం వల్ల చాలా మంది దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయని, మళ్లీ కొత్తగా హెచ్1బీ వీసాలిస్తే ఆ జాబితాలో వేలాది మంది చేరిపోతారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

వీసాలు మంజూరు చేయడం వల్ల కొత్తగా 60 వేల మంది అనుకోకుండానే గ్రీన్ కార్డులకు బాధితులవ్వాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్ వాయిస్ సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ వాయిస్‌లో 1.30 లక్షల భారతీయులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో వైద్యులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తల వంటి వారున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయుల హక్కులపై సంస్థ పోరాడుతోంది.

- Advertisement -