నాకొడుకును దారుణంగా చంపేశారు: హేమంత్ తల్లి

218
avanthi

హైదరాబాద్ చందానగర్‌లో దారుణం చోటుకుసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న యువ జంటను కిడ్నాప్ చేసి దుండగులు సంగారెడ్డిలో భర్త హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. జిల్లాలోని కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పడేశారు.

హేమంత్‌ హత్యపై తల్లి రాణి స్పందించారు. నేనంటే నా కొడుకుకు ప్రాణం.. ఉదయం లేచినప్పటి నుండి తనతో మాట్లాడకుండా హేమంత్‌ ఉండలేడని తెలిపింది. అవంతిక ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్లకు ఇచ్చేసామని తెలిపింది. మరో కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.

హేమంత్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హేమంత్ భార్య అవంతి ఈ ఘటనపై స్పందించి తన చిన్న మేనమామ యుగంధర్ ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మా పెళ్లి జరిగి మూడు నెలలు అవుతున్నా నా తల్లిదండ్రులు హేమంత్‌ను అంగీకరించలేదని తెలిపింది.