సింగరేణి కార్మికుల రాజ్‌ భవన్ ముట్టడి

23
- Advertisement -

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

రాజ్ భవన్ ముందు నిరసనకు దిగిన బీఆర్‌టీయూ నేత రాంబాబు యాదవ్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కాపు కృష్ణ, తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను బీఆర్‌టీయూ, టీజీబీకేఎస్ నేతలు ఖండించారు.

Also Read:23 నుంచి శాస‌న‌స‌భ స‌మావేశాలు..

- Advertisement -