సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను లక్ష రూపాయలు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు టిజిబికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు. సింగరేణి కార్మికులకు 28శాతం బోనస్ ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పారు. సింగరేణి సంస్థలో గత ఆర్థిక సంస్థలో అనేక లాభాలు వచ్చాయన్నారు. గత సంవత్సరం బోనస్ కంటే ఈఏడాది 40వేలు అధికంగా ఇచ్చారని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రం లో కూడా ఇంతలా బోనస్ లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈసందర్భంగా కోల్ బెల్ట్ ఏరియా లో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రి కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు . రానున్న రోజుల్లో మరింత కష్టపడి సింగరేణికి మరిన్ని లాభాలు తీసుకువచ్చేలా పనిచేస్తామని చెప్పారు. గతంలో వచ్చిన లాభాల కంటే ఈ ఏడాది వచ్చిన లాభాలు తక్కువే అయినా ఈసారి సీఎం కేసీఆర్ రూ.40వేలు అధికంగా ఇచ్చారన్నారు. బోనస్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.