ఒడిశా సీఎంను కలిసిన సింగరేణి సీఎండీ

472
- Advertisement -

ఒడిస్సా రాష్ట్రంలో ‘నైనీ’ బొగ్గు గని ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. దీని కోసం ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ పాథిని సింగరేణి సి అండ్‌ ఎం.డి. ఎన్.శ్రీధర్ కలిశారు. ఈ సందర్భంగా భూసేకరణ, అనుమతుల్లో ఒరిస్సా ప్రభుత్వ సహకారం అందించాలని సి&ఎం.డి. ఎన్.శ్రీధర్‌ కోరారు.

odisha cm

దీనికి స్పందించిన ఒడిశా  రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలు సానుకూలత తెలిపారు. నైనీ బ్లాకులో 34 కోట్ల (340 మిలియన్) టన్నుల బొగ్గు నిల్వలు – ఏడాదికి కోటి (10 మిలియన్) టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇక ఫణి తుఫాను బాధిత ఒడిస్సా రాష్ట్రానికి సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ సహయంగా కోటి రూపాయల విరాళం చెక్కును ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అందజేశారు.

- Advertisement -