ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో రోజురోజుకు అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎందుకంటే శారీరక శ్రమ లేకపోవడం, కుర్చికే అతుక్కుపోవడం ఫలితంగా మెజార్టీ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే చిన్నచిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
()రోజూ 30–60 నిమిషాలు స్క్రీన్లకు దూరంగా ఉండండి: మొదట రోజుకు అరగంట నుంచి గంట వరకు ఫోన్కు విరామం ఇవ్వండి. ఆ సమయంలో పుస్తకం చదవడం, సంగీతం వినడం, నడకకు వెళ్లడం లేదా కుటుంబ సభ్యులతో గడపడం చేయవచ్చు.
()అవసరం లేని నోటిఫికేషన్లను నిలిపివేయండి: ముఖ్యమైనవి కాని యాప్ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. దీనివల్ల పదేపదే ఫోన్ చూడాలనే ఆలోచన తగ్గుతుంది.
()ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి. ఫోన్ను మంచానికి దూరంగా ఉంచి, నిద్రకు ముందు కొంతసేపు స్క్రీన్లను ఉపయోగించకండి.
() శారీరక వ్యాయామానికి సమయం కేటాయించండి: నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, బయట కార్యకలాపాలకు రోజువారీ జీవితంలో చోటు కల్పించండి.
()మైండ్ఫుల్నెస్ సాధన, ప్రశాంతంగా కొంతసేపు కూర్చోవడం వంటి పద్ధతులు ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడవచ్చు. పుస్తక పఠనం, వంట చేయడం, తోటపని, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం లేదా సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
అయితే టెక్నాలజీ మన రోజువారీ జీవితాన్ని పూర్తిగా నియంత్రించకుండా చూసుకోవడం అవసరం. సోషల్ మీడియాను చూసేందుకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించుకోవడం, భోజనం చేసే సమయంలో ఫోన్ను పక్కన పెట్టడం, కార్యాలయ సమయం తర్వాత పని సందేశాల వినియోగానికి పరిమితులు విధించడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి.
Also Read:ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ నేలమట్టం
పడుకునే ముందు ఫోన్ను పక్కన పెట్టడం, అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం లేదా రోజుకు గంటసేపు స్క్రీన్లకు దూరంగా ఉండటం.. ఇలా చిన్న మార్పులతో డిజిటల్ డిటాక్స్ను ప్రారంభించవచ్చు. టెక్నాలజీకి శాశ్వతంగా దూరమవడం కాదు.. మెరుగైన నిద్ర, ఏకాగ్రత, ఆరోగ్యకరమైన సంబంధాలు, సమతుల్యమైన జీవనశైలికి తగినంత సమయం కేటాయించడమే దీని లక్ష్యం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

