వేలిముద్ర వేయండి యాక్టివ్‌ సిమ్‌ తీసుకోండి

286
online news portal
- Advertisement -

సిమ్‌కార్డ్‌ కావలంటే పదే పదే టెలికాం ఆఫీసుల చుట్టు తీరగాల్సిన అవసరంలేదు. ఓటర్‌ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజ్‌ఫోటో అంతకన్న అవసరం లేదట. కేవలం ఆధార్‌కార్డు నెంబర్‌, వేలిముద్ర ఉంటే చాలట…10నిమిషాల్లోనే సిమ్‌ యాక్టివేషన్‌ కూడా అయిపోతుందట. ఇక సిమ్‌ కార్డు పోందటం ఈజీ అయినట్లే లెక్క.

సిమ్‌కార్డు కావాలంటే మనం ఇంతక ముందు ఫోటో,గుర్తింపు కార్డు ఇచ్చే వాళ్లం ఆతర్వాత సిమ్‌ యాక్టివేషన్‌కు రెండు లేదా మూడురోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సిమ్‌కార్డ్‌ యాక్టివేషన్ సులభతరమైంది. ఆధార్‌ కార్డు నెంబర్‌తో పాటు వేలిముద్రతో కేవలం 10నిమిషాల్లో సిమ్‌కార్డ్‌ యాక్టివేషన్‌ పూర్తి అవుతోందట.

online news portal

ఇక 4జీ రాకతో అన్నిటా ఊహించని వేగం కనిపిస్తోంది. సిమ్‌కార్డుల యాక్టివేషన్‌ కూడా నిమిషాల్లో పూర్తవుతోంది. ఒకప్పుడు సిమ్‌కార్డు తీసుకొవలంటే రెండు మూడురోజుల సమయం పట్టేది. కాని ఇచ్చిన పత్రాల్లో తేడా ఉంటే మరికొన్ని రోజుల సమయం కూడా పట్టేది. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం స్పాట్ యాక్టివేషన్‌ సిమ్‌కార్డులు అందుబాటులోకి వచ్చేశాయి. పాస్‌పోర్టు సైజు ఫోటోలు, ఓటర్ఐడీ జిరాక్స్‌ పేపర్లతో అవసరం లేకుండా కేవలం ఆధార్‌కార్డ్‌ నెంబర్‌, వేలిముద్రతో కొత్త సిమ్‌లను అందిస్తున్నాయి పలు కంపెనీలు.

online news portal

అన్ని టెలికాం సంస్థలు స్పాట్‌ యాక్టివేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకరానున్నాయట. వీటి ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆయా కంపెనీ సంస్ధలు భావిస్తున్నాయి. స్పాట్‌ యాక్టివేషన్ పద్ధతి వల్ల అసాంఘిక శక్తులకు సిమ్‌కార్డుల వెళ్లే ప్రమాదం ఉండదు. ఇతరుల ఐడీ కార్డులు, ఫోటోలతో సిమ్‌ తీసుకునే వాటికి చెక్‌ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల దోంగ సిమ్‌లతో వ్యాపారం చేసే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చు.

సిమ్‌యాక్టివేషన్‌ కావాలంటే ఆ నెట్‌వర్క్‌ సంబంధిత టెలికాం ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా సిమ్‌ యాక్టివేషన్‌కు కావల్సిన జిరాక్స్‌లు, ఫోటోల కోసం చాలా ఇబ్బంది పడేవారు. సకాలంలో సిమ్‌ ఓకే కాకపోతే ఆకంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం లేదా సేల్స్‌మెన్‌ను సంప్రదించి తమ సమస్యను తెలియచేసేవాళ్లు. ప్రస్తుతం స్పాట్‌ యాక్టివేషన్ విధానంతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే సమస్య పరిష్కరించుకునే వీలు కలుగుతుంది.

online news portal

4జీ స్మార్ట్‌ఫోన్‌కు వేలిముద్ర తీసుకుని ఆన్‌లైన్‌లో స్పాట్‌ సిమ్‌ యాక్టివేషన్‌ చేస్తున్నారు. వినియోగదారుడి వేలిముద్రను జోడించిన తర్వాత ఆయా టెలికాం సంస్ధలకు చెందిన యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేస్తారు. ఆ తరువాత మళ్లీ ఫింగర్‌ ప్రింట్‌ తీసుకుని వినియోగదారుడి ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌ అందులో నమోదు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ వేలిముద్ర తీసుకుని అది పూర్తయిన వెంటనే వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రాగా సిమ్‌ కార్డును స్కాన్‌ చేసి యాక్టివేషన్‌ పూర్తి చేస్తారు.

- Advertisement -