బంగారం కొనుగోలుదారులకు స్వల్ప రిలీఫ్. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గగా కేజీ వెండి ధర రూ. రూ. 200 పెరిగింది. ఇక వెండి ధరలు రికార్డు స్థాయిలో లక్షకు చేరుకున్నాయి.
హైదరాబాద్, విజయవాడలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450గా ఉండగా 10 గ్రాముల 24 బంగారం ధర రూ.73,580గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 73,730గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,180గా ఉంది.
బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు పెరగడంతో కేజీ వెండి రేటు రికార్డు స్థాయిలో లక్షకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 99,500, కోల్ కతా, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 95,000గా ఉంది. గమనిక బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..