‘సిల్లీ ఫెల్లోస్‌’ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌.. వీడియో

300
Silly Fellows
- Advertisement -

అల్లరి నరేష్, సునీల్, పూర్ణ, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సిల్లీ ఫెల్లోస్. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Silly Fellows

ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై క్రేజ్ పెంచేలా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. శ్రీ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించారు. అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో ‘తొట్టి గ్యాంగ్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్‌గా నటించిన విషయం విదితమే. మ‌రి ఈ సినిమాలో ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే నటించారు.

https://youtu.be/B20-yULS8mg

- Advertisement -