జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు..

351

పవర్ అనే పదానికి అర్ధాన్ని వెతికితే ముందుగా కనిపించే పేరు పవన్. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టాలన్నా కొత్త రికార్డులు తిరిగి రాయాలన్నా ఆ పవర్ ఉండాల్సిందే. కోట్లాది మంది అభిమానులు ఆయన పేరు చెబితే ఊగిపోతారు. ఎనలేని ఫాలోయింగ్ తో వెలకట్టలేని అభిమానంతో పవనిజం అంటూ చెలరేగిపోతారు. జయాపజయాలకు అతీతంగా, టాలీవుడ్ నడిబొడ్డుమీద తన జెండాని, ఎజెండాను ఎగరేసిన ఆ పవర్  స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ఈ రోజు..

Pawan Kalyan Birthday

అతని స్టైల్స్ సూపర్బ్ .. అతని డైలాగ్స్ అదుర్స్. లుక్స్ లో మ్యాజిక్. నడకలో స్టన్నింగ్ మూవ్ మెంట్స్. టోటల్ గా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే వ్యక్తి .. ఆరడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ పవర్ స్టార్ ఆర్తులకు అండగా నిలుస్తున్నాడు. ప్రజాసేవ కోసం క్రియాశీలక రాజకీయాల్లోకి జనసేన పార్టీ ద్వారా ఎంటర్ అయ్యాడు . కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ యూత్ కు ముఖ్యంగా అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. యువతలో అతని పేరు చెప్పగానే పులకింతలు. సభల్లో చూడగానే కేరింతలు. అత్తారింటికి దారేదీ అన్నట్టు పవన్ కళ్యాణ్ సినిమా ఆడే థియేటర్ కు దారేదీ అని వెతుక్కుంటారు. ఆ గబ్బర్ సింగ్ ను పదే పదే చూడాలనుకుంటారు. అంతేకాదు…సినిమాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ పవన్ డైలాగ్ చెబితే చాలు ఫ్లాట్ అయిపోతున్నారు.

Pawan isolates himself

పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్. టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఒక ఫైర్ బ్రాండ్. తన అరుదైన వ్యక్తిత్వంతో, అద్భుతమైన ఆలోచనలతో స్టార్ కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ చెయిర్ మీద దర్జాగా కూర్చున్న ఆయనది పవర్ స్టార్ డమ్. పేరు ముందే పవర్ ని నింపుకున్న స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం చేసినా, స్వశక్తితో తక్కువ టైమ్‌లో అంచలు అంచలుగా ఎదిగి పవర్ స్టార్‌గా అభిమానుల గుండేల్లో చెరగని ముద్రను వెసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పిలుపే ఒక ప్రభంజనంలా అభిమానులు చేలరేగిపోతారు.

సాధారణమైన ఇమేజ్ తోనే వెండితెరమీద తెరంగేట్రాన్ని ప్రారంభించాడు. కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఫోకస్ అయిన పవన్ కళ్యాణ్, తనకున్న అసాధారణమైన టాలెంట్ తో క్రమేపి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ లాంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, పూరీ బద్రి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగింది. విభిన్నతరహా పాత్రలతో, విలక్షణమైన కేరక్టరైజేషన్స్ తో పవర్ స్టార్ వెండితెరమీద తన స్టామినాను చాటుకున్నాడు. అక్కడినుంచి ఆయన మేనరిజమ్స్ తో అభిమానులకి పవన్ మ్యానియా పట్టుకుంది.

Pawan Kalyan Birthday

ఉన్న ఫాక్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని ఎనౌన్స్ చేస్తే చాలు…అప్పటి నుంచీ ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో క్రేజ్ క్రియేటవుతుంది. అతని సినిమాకోసం సంవత్సరమైనా వెయిట్ చేస్తారు. షూటింగ్ స్టార్టయినప్పటి నుంచి… ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని తహతహలాడుతుంటారు. హీరోయిన్ తో డాన్స్ చేసేటప్పుడు ఎంత హుషారుగా, స్టైల్స్ ఇస్తాడో…పోలీస్ కేరక్టర్స్ వేసేటప్పుడు అంత సీరియస్ గానూ చేస్తాడు. పవన్ కల్యాణ్ ఏ తరహా సినిమా చేసినా అది హిట్ అవుతుంది. యాక్షన్ డ్రామానే కాదు…అత్తారింటికి దారేది వంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ లో కూడా పవన్ హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు. జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంటరైనతర్వాత సినిమాల పరంగా పవన్ కు కొంత గ్యాప్ వచ్చింది. కొంతకాలం కిందటే ఆ గ్యాప్ ను ఫిల్ చేశాడు. అవన్నీ ఓవర్ కం చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు పవన్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇటు సినిమాల్లోనూ, అటు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉన్నాడు.

Pawan isolates himself

పవన్ కళ్యాణ్ ను పవర్ కళ్యాణ్ అని కూడా అంటారు. క్రేజీ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మూవీల్లోకి వచ్చిన తర్వాత…హీరోయిజంలో స్టైలిష్‌నెస్‌ వచ్చింది. కథానాయకుడంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉండాలనే ఈక్వేషన్ మారిపోయింది. హీరో అంటే స్టైల్‌ గా, సరదాగా ఉండాలనే ఒక కొత్త ‌ట్రెండ్‌ పవన్‌తోనే టాలీవుడ్‌లో మొదలైంది అని చెప్పొచ్చు. పవన్‌ ప్రతి కదలికలో అతనికే ప్రత్యేకమైన ఆ స్టైల్‌ కనబడుతుంది. అలాగే…పాలిటిక్స్ లో కూడా తన స్టాంప్ వేసుకోబోతున్నాడు. పవన్‌ ఏ కేరక్టర్‌ వేసినా ఆ పాత్ర పోషణలో ప్రత్యేకత ఉంటుంది. ఆ కేరక్టర్‌ను జాలీగా, ‌హ్యాపీగా, ఈజీగా, సింపుల్‌గా, నేచురల్‌గా చేస్తాడు. మరి రాబోవు రోజుల్లో పవన్‌ ఇటు సినిమాలతోను అటు రాజకీయంగా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకోవాలని కోరుకుంటూ పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు గ్రేట్ తెలంగాణ.కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

JANASENANI - A Social Scientist | A Special Tribute Video | JanaSena Party