ప్రమాణ స్వీకారం..తెల్లారే రాజీనామా!

13
- Advertisement -

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. సిక్కింలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సతీమణి కృష్ణకుమారి రాయ్‌ గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా దానిని వెంటనే అమోదించారు స్పీకర్.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో నంచిసింగితాంగ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కృష్ణకుమారి. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని సీఎం తమాంగ్ వెల్లడించారు. తామిద్దరం ప్రజాసేవలో పూర్తిగా అంకితమవుతారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

Also Read:రాజ్యసభకు చిరు

- Advertisement -